Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజ్ఞన్ భవన్ లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచన లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సామాజిక దూరంతో జూలైలో పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి ఒక ఇది ఛాయిస్. కరోనావైరస్ కారణంగా ఎంపీలు ఢిల్లీ కి వెళ్లడానికి భయపడుతున్నట్లు సమాచారం. వర్చువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచన లో కేంద్రం.
  • ఢిల్లీ లో లిక్కర పై ఉన్న స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం. మద్యంపై గరిష్ట రిటైల్ ధరలో 70% విధించిన స్పెషల్ కరోనా ఫీజు'ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం 2020 జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది.
  • విశాఖ: లో రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్. బౌన్సర్ లతో హల్చల్ చేసిన చిట్టిమాము గ్యాంగ్. పక్కా సమాచారంతో పార్టీ పై రైడ్ చేసిన సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పలువురు అరెస్ట్. భారీగా లిక్కర్,గంజాయి,లక్ష50వేలు నగదు స్వాధీనం. దువ్వాడ పోలీసులకు అప్పగించిన సిటీఎఫ్.
  • అమరావతి: రాష్ట్రంలో మరింత పారదర్శకంగా ఇసుక విక్రయాలు. గౌరవ ముఖ్యమంత్రి సమీక్షలో పలు కీలక నిర్ణయాలు. ఆన్ లైన్ తో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ . దీంతో దళారీల ప్రమేయం లేకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు. పోర్టల్ ను ఎక్కువ సమయం తెరిచి వుంచాలని నిర్ణయం. 1 నుంచి 5, ఆపై ఆర్డర్ స్ట్రీం లలో కూడా ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక. దీంతో 5 కి.మీ. పరిధిలోని ప్రజల అవసరాలకు వెలుసుబాటు. వర్షాకాల కోసం 70 లక్షల ఎంటిల ఇసుక నిల్వ లక్ష్యం. రోజుకు 3 లక్షల ఎంటిల ఇసుక తవ్వకాలు జరపాలని లక్ష్యం. దీంతో అడిగిన వారందరికీ ఇసుక సరఫరా. ఇసుక నాణ్యతను పరిశీలించేందుకు టెక్నికల్ టీం లు. ఇకపై జాయింట్ కలెక్టర్ లకే బల్క్ బుకింగ్ ల బాధ్యత . భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది.
  • ఢిల్లీలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్. ఢిల్లీలో నలుగురికి టెస్ట్ జరిపితే ఒకరికి పాజిటివ్ రిసల్ట్. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశలోకి చేరుకుందన్న మాజీ ICMR చీఫ్ ఎన్ కె గంగూలీ. ఢిల్లీలో మొత్తం 27,654 కేసులు,761 మంది మృతి. ఢిల్లీలో 219కి చేరిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య.

తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?

chintu pintu in telangana politics, తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్‌నేమ్స్‌ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా వున్నవారితోపాటు ఆ తర్వాత సంబంధిత వార్తలు వినేవారు, చదివే వారు కూడా మనసారా నవ్వుకునే ఛాన్స్ దక్కుతుంది. ఇలాంటి పొలిటికల్ అండ్ సెటైరికల్ నిక్‌నేమ్స్‌లో మనకు బాగా గుర్తుండిపోయింది ‘‘బిగ్ బాస్ ’’ పదం.

2003లో విపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి సీఎల్పీ కార్యదర్శి, మాజీ మంత్రి మైసూరారెడ్డి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీ వేదికగా.. ముడుపులు పొందిన బిగ్ బాస్ ఎవరు ? అంటూ పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన కామెంట్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలనే కాకుండా.. లైవ్ చూస్తున్న వారందరినీ అలరించాయి.

ఆ తర్వాత పలు సందర్భాలలో తమ తమ రాజకీయ ప్రత్యర్థులకు నిక్ నేమ్స్ తగిలించడం కూడా కొనసాగింది. తాజాగా తెలంగాణలో మరోసారి రాజకీయ ప్రత్యర్థులపై నిక్ నేమ్స్ తగిలించి మరీ విమర్శించిన ఉదంతం చర్చనీయాంశమైంది. గతంలో దాదాపు అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో కల్పించుకుంటూ అత్యంత కీలకంగా వ్యవహరించిన చింటూ , పింటూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ప్రశ్నించారు.

గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ విలేకరులతో మాట్లాడారు. కెసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టేసి మరీ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని వారు ఆరోపించారు. రైతు బంధు ఆగిపోయిందని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదని, ఆర్టీసీ విషయంలో సర్కార్ వైఖరి మొండితనంగా వుందని దయాకర్, సంపత్ విమర్శించారు.

chintu pintu in telangana politics, తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?

ఇలా విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేతలు.. ‘‘ఇంత జరుగుతున్నా చింటూ, పింటూల జాడ లేదని’’ కామెంట్ చేయడంతో అక్కడున్న విలేకరులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ చింటూ, పింటూ ఎవరని కొందరు అడగడంతో గాంధీభవన్‌లో నవ్వులు పూసాయి. గతంలో ప్రతీ విషయంలో జోక్యం చేసుకున్న కేటీఆర్‌, హరీష్‌లు ఎక్కడ పోయారంటూ.. చింటూ అంటే కెటీఆర్ అని, పింటూ అంటే హరీశ్ రావ్ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీరిద్దరు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రుల్లో పదవీ భయం వుందని అందుకే ఎవరూ ఏమీ మాట్లాడడం లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు.

Related Tags