WSC Recruitment: డిప్లొమా ఉత్తీర్ణతో కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేలకిపైగా జీతం..

|

Oct 28, 2022 | 5:20 PM

గువాహటిలోని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ (డబ్ల్యూఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో జూనియర్‌ లెవల్‌లో ఉన్న పోస్టలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

WSC Recruitment: డిప్లొమా ఉత్తీర్ణతో కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేలకిపైగా జీతం..
WSC Recruitment
Follow us on

గువాహటిలోని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ (డబ్ల్యూఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో జూనియర్‌ లెవల్‌లో ఉన్న పోస్టలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ వీవర్‌, సీనియర్‌ ప్రింటర్‌, జూనియర్‌ ప్రింటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మెట్రిక్యులేషన్‌/ ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డైరెక్టర్‌, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌, ఐఐహెచ్‌టీ క్యాంపస్‌, జవహర్‌ నగర్‌, ఖానపర, గువాహటి 781022 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ప్రాక్టికల్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 92,300 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..