IB Recruitment 2022: పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను...
ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ (1,521), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) (150) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25-11-22 నాటికి ఎస్ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను టైర్ 1, టైర్ 2, టైర్ 3 పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100, ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 50, ఇతరులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ 05-11-2022న మొదలవుతుండగా, 25-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..