Best Time to Study: ఉదయమా.. లేట్‌ నైటా..? చదువుకోవడానికి ఏ సమయం మంచిది..

చాలా మంది ఒకే సమయంలో కాకుండా వారి శక్తి సామర్థ్యాలను బట్టి పగలు లేదా రాత్రిళ్లు చదివేందుకు ఆసక్తి చూపుతుంటారు.అయితే ఏ సమయం చదువుకోవడానికి అనువుగా ఉంటుందనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ప్రారంభించేవారా లేదా అర్ధరాత్రిళ్లు ప్రారంభించాలా? అవే విషయంలో..

Best Time to Study: ఉదయమా.. లేట్‌ నైటా..? చదువుకోవడానికి ఏ సమయం మంచిది..
Best Time For Study 2

Updated on: Jul 24, 2025 | 6:12 PM

కొంత మంది రాత్రిపూట చురుగ్గా ఉంటారు. వీరి బుర్ర రాత్రిళ్లు పాదరసంలా పని చేస్తుంది. ఇలాంటి వారిని ‘నైట్ ఒవెల్స్‌’ అంటారు. పగటి వేళల్లో చురుగ్గా ఉండే వారిని ‘మార్నింగ్‌ లార్క్స్‌’ అంటారు. అందుకే చాలా మంది ఒకే సమయంలో కాకుండా వారి శక్తి సామర్థ్యాలను బట్టి పగలు లేదా రాత్రిళ్లు చదివేందుకు ఆసక్తి చూపుతుంటారు.అయితే ఏ సమయం చదువుకోవడానికి అనువుగా ఉంటుందనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ప్రారంభించేవారా లేదా అర్ధరాత్రిళ్లు ప్రారంభించాలా? అవే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీ మెదడు ఏ సమయం బాగా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరి మెదడుకు దాని స్వంత లయ ఉంటుంది. కొంతమంది ఉదయం సహజంగానే అప్రమత్తంగా ఉంటుంది. మరికొందరికేమో రాత్రిపూట చురుగ్గా ఉంటుంది. అయితే ఉదయం చదువుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రాత్రి నిద్ర మెదడును రిఫ్రెష్ చేస్తుంది. కాబట్టి కఠినమైన విషయాలను ముందుగానే నేర్చుకోవడానికి ఉదయం పూట ఫ్రెష్‌ టైం మంచిదని, ఈ టైంలో ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందని చెబుతున్నారు. అయితే రాత్రిపూట కూడా చక్కగా చదువుకోవచ్చు. రాత్రిళ్లు అంతా నిద్రపోయాక నిశ్శబ్దంగా ఉంటుంది. దీంతో చదువుకు అంతరాయం ఉండదు. అందుకే చాలా మందికి రాత్రిపూట చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా చదవడానికి, రాసుకోవడానికి ఈ టైం అనువైనదిగా భావిస్తారు.

ఉదయం పూట జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. కానీ ఉత్పాదకత గడియారం కంటే దినచర్యపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉదయం వేళలు స్క్రీన్ అలసట, ఒత్తిడిని తగ్గిస్తాయి. నిద్ర భంగం కలిగితే రాత్రులు బర్న్ అవుట్ కు దారితీయవచ్చు. మెదడు క్షీణతను నివారించడానికి సమతుల్యత అవసరం. అందుకే కొందరు ఉదయం 5 గంటలకే చదవడం ప్రారంభిస్తే.. మరికొందరు రాత్రి 11 గంటల తర్వాత చదివేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు ఎక్కువ మేల్కొని, ఏకాగ్రతతో చదివ గలిగే వారికి ఏ సమయమైనా మంచిదే. వీరు రెండింటినీ ప్రయత్నించవచ్చు. ఒక వారం ఉదయం చదువుకోండి. మరుసటి వారం లేట్‌ నైట్‌ చదవండి. ఈ రెండింటిని సమతుల్యం చేసుకుని ఏ సమయం మీకు అనువుగా ఉంటుందో ట్రాక్ చేసి, దానిని ఎంచుకుంటే సరిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.