vijayawada government general hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

|

May 21, 2021 | 6:59 AM

Jobs in government general hospital vijayawada: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా...

vijayawada government general hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Vijayawada General Hospital
Follow us on

Jobs in government general hospital vijayawada: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 7 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్‌ డాక్టర్ విభాగంలో 2 ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ట్రెయినింగ్‌ సర్టిఫికేట్‌(అడిక్షన్‌ మెడిసిన్‌) ఉండాలి. సైకియాట్రిక్‌ మెడిసిన్‌/ఎండీ సైకియాట్రీలో పీజీ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి.

* నర్సు (02) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు..  ఏఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి. జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) వారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

* కౌన్సిలర్ (02) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సైకాలజీ/సోషల్‌ వర్క్‌/సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఈ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

* డేటా మేనేజర్ (01) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అర్హత/అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు) అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తును సూపరింటెండెంట్‌/డిప్యూటీ సూపరింటెండెంట్, ఓల్డ్‌ గవర్న్‌మెంట్‌ జనరల్‌ హాస్పిటల్, హనుమాన్‌పేట, విజయవాడ చిరునామకు పంపించాలి.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదిగా 21.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://krishna.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.