UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Dec 14, 2022 | 2:32 PM

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు మంత్రిత్వ శాఖల్లోని మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Upsc Jobs
Follow us on

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు మంత్రిత్వ శాఖల్లోని మొత్తం 19 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కైవిస్ట్ (జనరల్) (13), డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో స్పెషలిస్ట్ గ్రేడ్ – 3(పీడియాట్రిక్స్) (5), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్ బి (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్) (1) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ (చరిత్ర) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగాల్లో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 29-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..