UPSC Govt Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఈ అర్హతలుంటే చాలు

UPSC Job Notification 2025: వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కేవలం విద్యార్హతల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు ఎంపిక..

UPSC Govt Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! ఈ అర్హతలుంటే చాలు
UPSC Job Notification

Updated on: Sep 13, 2025 | 10:06 AM

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 213 అడిషనల్ గవర్నమెంట్‌ అడ్వకేట్‌, అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌, అడిషనల్‌ లీగల్ అడ్వైజర్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ అడ్వకేట్‌, డిప్యూటీ గవర్నమెంట్‌ అడ్వకేట్‌ వంటి పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • అడిషనల్ గవర్నమెంట్‌ అడ్వకేట్‌ పోస్టుల సంఖ్య: 05
  • అసిస్టెంట్‌ లీగల్‌ అడ్వైజర్‌ పోస్టుల సంఖ్య: 16
  • అడిషనల్‌ లీగల్ అడ్వైజర్‌ పోస్టుల సంఖ్య: 02
  • అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ అడ్వకేట్‌ పోస్టుల సంఖ్య: 01
  • డిప్యూటీ గవర్నమెంట్‌ అడ్వకేట్‌ పోస్టుల సంఖ్య: 02
  • డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ పోస్టుల సంఖ్య: 12
  • లెక్చరర్‌(ఉర్దూ) పోస్టుల సంఖ్య: 15
  • మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 125
  • అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టుల సంఖ్య: 32
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల సంఖ్య: 03

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిగ్రీ(లా), పీజీ(ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనితో పాటు సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనరల్ అభ్యర్థులకు 50 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 53 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 56 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇక ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, అనుభం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.