UPSC Recruitment: పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్‌సీ.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Feb 12, 2022 | 6:11 PM

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

UPSC Recruitment: పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్‌సీ.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టోర్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నేవీ,ఆయుష్‌) పోస్టుల్లో భాగంగా హిస్టరీ, ఆయుర్వేద విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ, ఆయుర్వేద మెడినిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

* స్టోర్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

* అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు. ఇతరులు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 03-03-2022ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!

Andhra Pradesh: భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో

Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!