UPSC Assistant Director Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని.. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జనరల్, సైంటిస్ట్ (Drug Inspector Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జనరల్, సైంటిస్ట్ తదితర పోస్టులు
విభాగాలు: ఆయుర్వేద, బ్యాంకింగ్, రక్షణ రంగం, ఫైన్స్ మినిస్ట్రీ, హోం అఫైర్స్, ఫొరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/సీఏ/సీఎఫ్‌ఏ/మాస్టర్స్ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 2, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.