UPSC Recruitment 2021: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించుకోబోతోంది. అయితే సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్
https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అయితే దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 34
తెలుగు- 5, హిందీ- 9, ఇంగ్లీష్- 3, పంజాబీ- 3, మరాఠీ- 5, ఒడియా- 3, అస్సామీ- 2, మణిపూరి- 2, బెంగాలీ- 1, గుజరాతీ- 1
భర్తీ చేసే పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 12
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ పాస్ కావాలి. పదో తరగతి సంబంధిత భాషలో చదివి ఉండాలి.
అనుభవం- ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్‌పేపర్‌లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది.
అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Online Recruitment Application (ORA) for various recruitment posts లింక్ పైన క్లిక్ చేయాలి.
Advertisement No. : 09/2021 పైన క్లిక్ చేస్తే తర్వాత నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
నోటిఫికేషన్ పూర్తిగా చదివి అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు Senior Grade of Indian Information Service లింక్ పక్కన Apply Now పైన క్లిక్ చేయాలి.
తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇతర పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.