కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1930 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు: 1,930
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా నర్సు లేదా నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టరై ఉండాలి. లేదా జనరల్ నర్సింగ్ మిడ్-వైఫరీలో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. అలాగే కనీసం యాభై పడకల ఆసుపత్రిలో ఏడాది పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు మార్చి 27, 2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీ 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ 35 ఏళ్లు, దివ్యాంగలకు 40 సంవత్సరాల వయసు మించకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.25 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.