న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)-2024 ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 18న పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్ కింద యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 167 పోస్టులను భర్తీ చేయనుంది. స్టేజ్-1 (ప్రిలిమినరీ) పరీక్ష, స్టేజ్-2 (మెయిన్) ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి సిటీల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2024 ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 ప్రిలిమినరీ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి, అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ కానున్నాయి. స్టేజ్ 1లో కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది. స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ సీజీఎస్‌ఎస్‌ఈ 2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.