UPSC CMS Notification 2025: యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే

|

Feb 25, 2025 | 6:48 AM

యూపీఎస్‌సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నెలకు లక్షకుపైగా జీతంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత కొలువులు దక్కించుకోవాలనుకునే వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు..

UPSC CMS Notification 2025: యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే
UPSC CMS Notification 2025
Follow us on

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ).. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్, ఎకనామిక్‌ సర్వీస్, స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. సీఎంఎస్, ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌.. ఎందులో అవకాశం వచ్చినా లెవెల్‌ 10 హోదా దక్కుతుంది. వీరికి నెలకు రూ.56,100 వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందిస్తారు. భవిష్యత్తులో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్ వంటి అత్యున్నత స్థాయికీ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం వీరికీ దక్కుతుంది. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్ కింద మొత్తం 705 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) చక్కని అవకాశం. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ (సీఎంఎస్‌)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కోర్సు తుది దశలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2025 నాటికి 32 ఏళ్లకు మించరాదు. అదే సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ పోస్టులకు అయితే 35 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 11, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జులై 20, 2025వ తేదీన నిర్వహిస్తారు. ఎంబీబీఎస్‌ సిలబస్‌పై గట్టి పట్టున్నవారు సీఎంఎస్‌ పరీక్షలో తేలిగ్గా గట్టెక్కగలరు. పరీక్షలో విజయానికి గతంలో నిర్వహించిన సీఎంఎస్, నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నాపత్రాలు పరీక్షకు ఉపయోగపడతాయి.

ఇక ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) నోటిఫికేషన్‌లో 35 పోస్టులు, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) నోటిఫికేషన్‌ కింద 12 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఈ రెండు నోటిఫికేషన్లు కూడా యూపీఎస్సీ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌ వివరాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.