UPSC Geo-Scientist 2023: యూపీఎస్సీ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్ – 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే..

|

Sep 22, 2022 | 8:01 AM

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023 (UPSC Combined Geo Scientist Examination-2023) ద్వారా 285 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల..

UPSC Geo-Scientist 2023: యూపీఎస్సీ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే..
Upsc Geo Scientist
Follow us on

UPSC Combined Geo Scientist Examination 2023: న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2023 (UPSC Combined Geo Scientist Examination-2023) ద్వారా 285 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గనుల మంత్రిత్వశాఖకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరుల శాఖకు చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డుల్లో ఖాళీగా ఉన్న కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. జియోలాజికల్ సైన్స్/జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్/మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ/హైడ్రోజియాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ, అప్లైడ్ జియోఫిజిక్స్‌లో ఎంఎస్సీ(టెక్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్‌) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్‌పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం సిటీల్లో ఈ పరీక్ష జరుగుతుంది.

ఖాళీల వివరాలు..
కేటగిరీ-1:

  • జియాలజిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 216
  • జియోఫిజిసిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 21
  • కెమిస్ట్, గ్రూప్-ఎ పోస్టులు: 19

కేటగిరీ-2:

ఇవి కూడా చదవండి
  • సైంటిస్ట్ ‘బి’(హైడ్రోజియాలజీ), గ్రూప్-ఎ పోస్టులు: 26
  • సైంటిస్ట్ ‘బి’(కెమికల్), గ్రూప్-ఎ పోస్టులు: 1
  • సైంటిస్ట్ ‘బి’(జియోఫిజిక్స్) గ్రూప్-ఎ పోస్టులు: 2

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 11, 2022.
  • దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: అక్టోబర్‌ 19, 2022 నుంచి అక్టోబర్‌ 25 వరకు.
  • అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్‌ 4, 2022.
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: ఫిబ్రవరి 19, 2023.
  • మెయిన్ పరీక్ష తేదీలు: జూన్ 24, 25, 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.