UPSC CDS Exam Notification 2024: డిగ్రీ అర్హతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. యూపీఎస్సీ సీడీఎస్‌ (2) 2024 నోటిఫికేషన్ విడుదల

|

May 21, 2024 | 11:10 AM

యూపీఎస్సీ ప్రతీయేట ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్సుల్లో ఉన్నతోద్యోగాలకు నియామక పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. వాటిల్లో డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ఒకటి. 2024-25 సంవత్సరానికి తాజాగా కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన వారికి శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో ఆకర్షణీయ..

UPSC CDS Exam Notification 2024: డిగ్రీ అర్హతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. యూపీఎస్సీ సీడీఎస్‌ (2) 2024 నోటిఫికేషన్ విడుదల
UPSC CDS Exam 2024
Follow us on

యూపీఎస్సీ ప్రతీయేట ఆర్మీ, నేవీ, ఏయిర్‌ ఫోర్సుల్లో ఉన్నతోద్యోగాలకు నియామక పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. వాటిల్లో డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ఒకటి. 2024-25 సంవత్సరానికి తాజాగా కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన వారికి శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. డిగ్రీ అర్హత కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2), 2024 ద్వారా మొత్తం 459 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు మాత్రం ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఏయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. అలాగే ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీల పోస్టులకు జులై 2, 2001 నుంచి జులై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఏయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు జులై 2, 2001 నుంచి జులై 1, 2005 మధ్య పుట్టినవారు అర్హులు. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 2000 నుంచి జులై 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 15 నుంచి జూన్‌ 4, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. మిగిలిన కేటగిరీలకు చెందిన వారు రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష సెప్టెంబర్‌ 1, 2024 ఉంటుంది.

విభాగాల వారీ ఖాళీల వివరాలు

  • ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), దెహ్రాదూన్- 100
  • ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 32
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌- 276
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌- 19.

ఎంపిక విధానం..

పరీక్ష మొత్తం రెండు దశల్లో ఉంటుంది. రాతపరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి వేరువేరు పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు. ఇంటర్వ్యూకి 300 మార్కులు కేటాయిస్తారు. ఓటీఏ పోస్టులకు 200 మార్కులకు మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఈ రెండు దశల్లో గట్టెక్కితే వైద్య పరీక్షలు నిర్వహించి, మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.