AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Mains DAF 2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2021 కు చెందిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF) IIను విడుదల చేసింది..

UPSC Mains DAF 2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి..
Nios Hall Ticket 2022
Srilakshmi C
|

Updated on: Mar 22, 2022 | 12:46 AM

Share

UPSC CSE DAF 2021 Application: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2021 కు చెందిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF) IIను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్స్‌ 2021కు హాజరైన అభ్యర్ధులు తప్పనిసరిగా DAF 2ను ఫిల్ చేయవల్సి ఉంటుందని ఈ సందర్భంగా యూపీఎస్సీ అభ్యర్ధులకు సూచించింది. మార్చి 24వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవడంలో విఫలం అయితే వారి అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని కమిషన్ ఈ సందర్భంగా తెల్పింది.

కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు 2021 ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలు  మార్చి 17న విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ప్రతిభకనబరచిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఈ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 5 నుంచి న్యూఢిల్లీలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో నిర్వహించబడతాయి. షెడ్యూల్ త్వరలో ప్రకటించనుంది. తుది ఫలితాలు విడుదలయ్యాక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ వంటి ఇతర సెంట్రల్ సర్వీసులకు కేటాయించడం జరుగుతుంది. ఐతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల్లో భాగంగా చివరి అంకమైన ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ప్రారంభానికి ముందు అభ్యర్ధులందరూ విధిగా డీఏఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

UPSC DAF 2కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లొ కనిపించే ‘UPSC CSE Mains DAF 2 2021’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • తగిన వివరాలతో లాగిన్ అవ్వాలి.
  • తర్వాత యూపీఎస్సీ మెయిన్స్ డీఏఎఫ్-II 2021 దరఖాస్తును పూర్తి చెసి, సబ్‌మిట్ చెయ్యాలి.
  • చివరిగా పూర్తి చేసిన దరఖాస్తును సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also Read:

HAL Recruitment 2022: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..