UPSC సివిల్ సర్వీసెస్ రిజర్వ్ జాబితా ఫలితాలు విడుదల.. 75 మంది అభ్యర్థుల ఎంపిక..

|

Dec 31, 2021 | 9:34 PM

UPSC Civil Services Main 2020: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2020

UPSC  సివిల్ సర్వీసెస్ రిజర్వ్ జాబితా ఫలితాలు విడుదల.. 75 మంది అభ్యర్థుల ఎంపిక..
Upsc
Follow us on

UPSC Civil Services Main 2020: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2020 రిజర్వ్ జాబితా తుది ఫలితాలను విడుదల చేసింది. 836 ఖాళీలకు గాను మొత్తం 761 మంది అభ్యర్థులను సిఫార్సు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ Bల నియామకం కోసం మెరిట్ ఆధారంగా సిఫార్సులు చేశారు.

కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్‌లోని రూల్ 16(4), (5) ప్రకారం సంబంధిత కేటగిరీల కింద చివరిగా సిఫార్సు చేసిన అభ్యర్థి కంటే తక్కువ మెరిట్ జాబితాను సిద్ధం చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ చేసిన డిమాండ్ ప్రకారం.. కమిషన్ ఇప్పుడు 75 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 ఆధారంగా మిగిలిన పోస్టులను భర్తీ చేయడానికి సిఫార్సు చేసింది. ఈ అభ్యర్థుల్లో 52 జనరల్ కేటగిరీ, 19 OBC, 2 EWS, 2 SC అభ్యర్థులు ఉన్నారు. వారి సమాచారం UPSC వెబ్‌సైట్ www.upsc.gov.inలో అందుబాటులో ఉంది. ఈ సిఫార్సు చేసిన అభ్యర్థులను సిబ్బంది, శిక్షణ విభాగం నేరుగా తెలియజేస్తుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అంటే ఏమిటి?
UPSC అనేది లెవెల్ A, లెవెల్ B ఉద్యోగుల రిక్రూట్‌మెంట్ కోసం ఒక స్వతంత్ర సంస్థ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అక్టోబర్ 1, 1926న స్థాపించారు. UPSC అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/. UPSC ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. UPSC దేశంలో ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. UPSC ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అలాగే ఇండియన్ యూనియన్ సాయుధ దళాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. UPSC అనేది జాతీయ స్థాయి పరీక్ష, ఇది భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని 24 సర్వీసులకు రిక్రూట్‌మెంట్‌కు బాధ్యత వహిస్తుంది. యుపిఎస్‌సి పరీక్ష భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి.

CLAT Exam 2022: ‘లా’ చదవాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. జనవరి 1 నుంచి CLAT రిజిస్ట్రేషన్ ప్రారంభం..

మీకు సైన్స్‌ అంటే భయమా..! కెరీర్‌లో ఎదగడానికి ఇంకా చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి..? అవేంటో తెలుసుకోండి..

NEET PG Counselling: మెడికోలకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 6 లోపు జరుగొచ్చు..