UPSC Civils Prelims 2024: నేడే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష.. 30 నిమిషాలు ముందే గేట్లు క్లోజ్‌

|

Jul 02, 2024 | 3:48 PM

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 పరీక్ష ఆదివారం (జూన్‌ 16) దేశవ్యాప్తంగా దాదాపు 80 నగరాల్లో జరగనుంది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షల నిర్వహణ తీరుపై దేశ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పరీక్ష కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని..

UPSC Civils Prelims 2024: నేడే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష.. 30 నిమిషాలు ముందే గేట్లు క్లోజ్‌
UPSC Civils Exam 2024
Follow us on

న్యూఢిల్లీ, జూన్‌ 16: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 పరీక్ష ఆదివారం (జూన్‌ 16) దేశవ్యాప్తంగా దాదాపు 80 నగరాల్లో జరగనుంది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షల నిర్వహణ తీరుపై దేశ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పరీక్ష కేంద్రాల గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతోపాటు జామర్లను ఏర్పాటు చేశారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తమతో హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఐడీ కార్డులేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 80 నగరాల్లో ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్షను ఉంటుంది. రెండు పేపర్లకు పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నారు. కాగా ఈ ఏడాది విడుదలైన నోటిఫికేషన్‌ ద్వారా దాదాపు 1,056 సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష ఎలా ఉంటుందంటే..

ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. పేపర్ 2 జనరల్ స్టడీస్‌లో 33 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు గుర్తిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

UPSC సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.