న్యూఢిల్లీ, మార్చి 6: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2024, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024లకు ఇటీవల నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మార్చి 5వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా తుది గడువు తేదీని పొడిగిస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అర్హులైన అభ్యర్థులు మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
కాగా యూపీఎస్సీ సీఎస్‌ఈ 2024 ప్రకటన ద్వారా 1,056 పోస్టులను, యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ఈ2024 నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఎస్‌ఈ పోస్టుల్లో బెంచ్‌మార్క్ వైకల్యం (PwBD) ఉన్న వ్యక్తుల కోసం 40 పోస్టులు, అంధత్వం, తక్కువ దృష్టి కలిగిన అభ్యర్థులకు-6 పోస్టులు, చెవిటి, వినికిడి లోపం ఉన్న అభ్యర్ధులకు-12 పోస్టులు, సెరిబ్రల్ పాల్సీ 9 పోస్టులు, లెప్రసీ నయం, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, లోకోమోటర్ వైకల్యం కలిగిన అభ్యర్ధులకు 13 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెల 26వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ- సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
యూపీఎస్సీ- ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.