UPSC CAPF Results 2023: యూపీఎస్సీ- CAPF, ఎన్‌డీఏ & ఎన్‌ఏ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

|

Sep 27, 2023 | 1:38 PM

యూపీఎస్సీ - సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 322 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జులై 6న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధుల్లో ఎంపికైన..

UPSC CAPF Results 2023: యూపీఎస్సీ- CAPF, ఎన్‌డీఏ & ఎన్‌ఏ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి
UPSC CAPF Results 2023
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 27: యూపీఎస్సీ – సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2023 రాత పరీక్ష ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 322 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జులై 6న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధుల్లో ఎంపికైన వారి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌.. కేంద్ర బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2) 2023 రాత పరీక్ష ఫలితాలు

యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) (2) 2023 రాత పరీక్ష ఫలితాలను కూడా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. మొత్తం 395 పోస్టుల నియామకాలకు సంబంధించి సెప్టెంబర్‌ 3న ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక సాధారణంగా రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి త్రివిధ దళాల విభాగాల్లో వచ్చే ఏడాది జూన్‌లో 152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు కల్పిస్తారు.

SSC CHSL 2023 పోస్టులు పెరిగాయ్‌..

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (సీహెచ్‌ఎస్‌ఎల్‌)కు పోస్టుల సంఖ్య పెరిగింది. గతంలో 1600 ఖాళీలకు ఎస్సెస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా ఆ పోస్టుల సంఖ్య 1762కి పెరిగింది. ఈ మేరకు తెలియజేస్తూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన వెలువరించింది. లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లలో భర్తీ చేస్తారు. కాగా ఈ పోస్టులకు టైర్‌-1 పరీక్షలు ఆగస్టులో నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలో టైర్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.