UOH Recruitment: యూనివర్సిటీ ఆప్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Dec 23, 2021 | 4:17 PM

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ వర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని..

UOH Recruitment: యూనివర్సిటీ ఆప్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ వర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? విద్యార్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రీసెర్చ్‌ అసోసియేట్‌ (03), డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* రీసెర్చ్‌ అసోసియేట్‌ లో భాగంగా ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీ, మెటబాలమిక్స్,ప్రొటియోమిక్స్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు నాలెడ్జ్‌ ఉండాలి.

* డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా దరఖాస్తును నింపి y.sreelakshmi@uohyd.ac.in మెయిల్‌ అడ్రస్‌కు పంపించాలి.

* రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,000 + 24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* డేటాఎంట్రీ ఆపరేటర్‌/సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000+24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021 చివరి తేదీ.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: BSNL Recruitment: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Year Ender 2021: ఒలింపిక్స్‌ నుంచి టీ20 ప్రపంచకప్‌ వరకు.. ప్రపంచ క్రీడల్లో కీలక ఘట్టాలు..!

Vehicle Fitness Certificate: RTO నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకున్నారా.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..