NEET Exam Postponed విద్యా రంగాన్ని కుదిపేస్తోన్న కరోనా.. నీట్‌ పరీక్ష కూడా వాయిదా..

NEET Exam Postponed: కరోనా మహమ్మారి గతేడాదిలాగే ఈసారి కూడా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతుండడంతో పరీక్షలను రద్దు చేయడం...

NEET Exam Postponed విద్యా రంగాన్ని కుదిపేస్తోన్న కరోనా.. నీట్‌ పరీక్ష కూడా వాయిదా..
Neet Exams

Updated on: Apr 15, 2021 | 8:43 PM

NEET Exam Postponed: కరోనా మహమ్మారి గతేడాదిలాగే ఈసారి కూడా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతుండడంతో పరీక్షలను రద్దు చేయడం లేదా వాయిదా వేస్తూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ పరీక్షలు ఏప్రిల్‌ 18 నుంచి నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా పరీక్ష తేదీ దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్‌ ట్వీ్ట్‌ చేశారు. ఈ ట్వీ్ట్‌లో మంత్రి.. ‘కోవిడ్‌19 కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం నీట్‌ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పేర్కొ్న్నారు.

మంత్రి చేసిన ట్వీట్‌..

ఇదిలా ఉంటే పెరుగుతోన్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ పరిధిలోని పరీక్షలను రద్దు చేయడమో, లేదా వాయిదా వేయడమో చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అలాగే రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. జూన్‌లో కరోనా పరిస్థితులను పరిశీలించి.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Also Read: Breaking: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

ఈ ఐఐటీ విద్యార్థి 15 నెలల్లో 5 వేల కోట్లు సంపాదించాడు..! నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.. ఎలాగో తెలుసుకోండి..?

Corona Pandemic: ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలూ కరోనా భూతానికి మరింత బలాన్ని ఇచ్చాయా? గణాంకాలు ఏం చెబుతున్నాయి?