Bank Jobs: యూనియన్‌ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

యూనియన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగం బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

Bank Jobs: యూనియన్‌ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Union Bank Of India
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 08, 2022 | 9:11 AM

యూనియన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ ప్రభుత్వ రంగం బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ట్రాన్‌సాక్షన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉటుంది.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ పీజీ/ సీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

* ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 27-12-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..