UGC NET 2025 Results out: యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో స్కోర్ కార్డు డౌన్‌లోడ్

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) డిసెంబర్ 2024 సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్ష తొమ్మిది రోజుల పాటు జరిగింది, 266 సిటీల్లో 558 పరీక్ష కేంద్రాలలో 16 సెషన్‌లలో జరిగాయి..

UGC NET 2025 Results out: యూజీసీ నెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో స్కోర్ కార్డు డౌన్‌లోడ్
UGC NET 2025 Results

Updated on: Feb 23, 2025 | 12:30 PM

యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఫలితాలు ఆదివారం (ఫిబ్రవరి 23) ఉదయం విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) ఫలితాలు విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం యేటా రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తు్న్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ సెషన్‌ పరీక్షను జనవరి 3, 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఫిబ్రవరి 3వరకు అభ్యంతరాలు స్వీకరించింది. తుది కీ రూపొందించిన ఎన్టీయే తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 8.49 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 6,49,490 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 5158 మంది అర్హత సాధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు పీహెచ్‌డీ అడ్మిషన్‌కు 48,161 మంది, కేవలం పీహెచ్‌డీ కోసం 1,14,445 మంది అర్హత సాధించారు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.

యూజీసీ నెట్‌ స్కోర్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.