UGC NET 2024 Exam: మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల

|

Dec 26, 2024 | 8:11 AM

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరో వారంలో నెట్ డిసెంబర్ సెషన్ పరీక్షలు నిర్వహించనుంది. పేపరీ లీకేజీలకు తావులేకుండా ఈ సారి ఆన్ లైన్ లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదలవగా.. త్వరలోనే అడ్మిట్ కార్డులు సైతం జారీ చేయనుంది..

UGC NET 2024 Exam: మరోవారంలో యూజీసీ- నెట్‌ (డిసెంబర్) పరీక్షలు.. రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల
UGC NET 2024 Exam
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్షలు సమీపిస్తున్నాయి. మరోవారంలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూజీసీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, విధివిధానాలు వంటి వివరాలు ఉంటాయి. ఇక మరో రెండు మూడు రోజుల్లో అడ్మిట్‌ కార్డులు కూడా విడుదల కానున్నాయి. జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ ఇప్పటికే వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో యూజీసీ నోట్‌ పరీక్షలు జరగనున్నాయి. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షను అర్హతగా నిర్వహిస్తారు. ఏటా ఈ పరీక్షను యూజీసీ రెండు సార్లు నిర్వహిస్తుంది.

యూజీసీ నెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. ఇది అర్హత పరీక్ష. ఇందులో అర్హత సాధించిన వారికి మాత్రమే పేపర్‌ 2ను పరిగణనలోకి తీసుకుంటారు. పేపర్‌ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి.

జూనియర్‌ కళాశాలల్లో 10 శాతం బోధనేతర కోటా భర్తీ చేయండి: ఇంటర్ బోర్డు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో బోధనేతర సిబ్బంది 10 శాతం కోటా భర్తీకి ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. 10 శాతం కోటా పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన స్వీకరణ అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టి.. మొత్తం 15 రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మరోవైపు జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులకు అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు అవకాశం కల్పించాలని, పదోన్నతులకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ అమరావతి, నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌లు కోరాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.