UGC NET 2021 Results Date: సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు యూజీసీ నెట్ 2021 ఫలితాలు వెలువడే తేదీ విడుదలయ్యింది. ఈ నెల (ఫిబ్రవరి) 10న ఫలితాలు ప్రకటించనున్నట్టు సమాచారం. కాగా యూజీసీ నెట్ డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలు గతేడాది నవంబర్ 20, డిసెంబర్ 5 మధ్య జరిగాయి. ఇక ఫేజ్ II పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 27 మధ్య జరిగాయి.ఫేజ్ III పరీక్షలు ఏ ఏడాది (2022) జనవరి 4, 5 తేదీల్లో జరిగాయి. ఈ సంత్సరం నెట్ పరీక్షలు జవాద్ తుఫాన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న వెలువడనున్న యూజీసీ నెట్ 2021 ఫలితాలను ugcnet.nta.nic.in లేదా nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా అభ్యర్ధులు తనిఖీ చేసుకోవచ్చు. కాగా యూజీసీ నెట్ ఫేజ్ I,ఫేజ్ II,ఫేజ్ III డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలు జనవరి 21న విడుదలయ్యాయి. జనవరి 24 వరకు ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలియజేశారు. వీటిని పరిశీలించిన యూజీసీ ఫలితాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
యూజీసీ నెట్ 2021 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలంటే..
అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in లేదా www.nta.ac.inని క్రమం తప్పకుండా చెక్ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.
Also Read: