UGC-IUAC Recruitment: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(UGC)కి చెందిన ఇంటర్ యూనివర్శిటీ యాక్సిలరేటర్ సెంటర్(IUAC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (శనివారం) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి.
* వీటిలో సైంటిస్ట్ సి (14), ఇంజనీర్లు (07), జూనియర్ ఇంజనీర్లు (05) ఖాళీలు ఉన్నాయి.
* సైంటిస్ట్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 26 ఏళ్ల మించకూడదు.
* ఇంజనీర్ పోస్టులకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
* జూనియర్ ఇంజనీర్ పోస్టులకు గాను ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. (05-03-2022)
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: షూటింగ్ స్పాట్ లో ఫ్యాన్స్ తో సందడి చేసిన రష్మిక..