తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి గాను 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’ ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’ నోటిఫికేషన్‌ను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గత జనవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీలో 575 సీట్లు, బైపీసీలో 565 సీట్లు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్లకు మెరిట్ సాధించిన మొదటి 1,140 మంది గిరిజన విద్యార్ధులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బాలుర సీట్లు 660, బాలికల సీట్లు 480 వరకు ఉన్నాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.