TSSPDCL Recruitment 2023: తెలంగాణ విద్యుత్తు శాఖలో 1601 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..

|

Feb 02, 2023 | 8:33 PM

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌).. డైరెక్ట్‌ ప్రాతిపదికన 1601 జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

TSSPDCL Recruitment 2023: తెలంగాణ విద్యుత్తు శాఖలో 1601 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..
TSSPDCL Recruitment 2023
Follow us on

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌).. డైరెక్ట్‌ ప్రాతిపదికన 1601 జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు దరఖాస్తుకోవాలంటే పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌ స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాణాత్మక నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 15 ముందు గానీ తర్వాత గానీ విడుదలవుతుంది. రాత పరీక్ష (జూనియర్ లైన్‌మెన్‌ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది) ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు జూనియర్ లైన్‌మెన్‌కు రూ.24,340ల నుంచి రూ.39,405ల వరకు, అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.64,295ల నుంచి రూ.99,345ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.