TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల (డిపో) లలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 అప్రెంటిస్‌ ఖాళీలను..

TSRTC Recruitment 2024: తెలంగాణ ఆర్టీసీలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు
TSRTC Recruitment 2024

Edited By: Ram Naramaneni

Updated on: Jan 21, 2024 | 9:55 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల (డిపో) లలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..

  • హైదరాబాద్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 26
  • సికింద్రాబాద్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 18
  • మహబూబ్ నగర్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 14
  • మెదక్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 12
  • నల్గొండ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 12
  • రంగారెడ్డి రీజియన్‌లో ఖాళీల వివరాలు: 12
  • ఆదిలాబాద్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 9
  • కరీంనగర్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 15
  • ఖమ్మం రీజియన్‌లో ఖాళీల వివరాలు: 9
  • నిజామాబాద్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 9
  • వరంగల్ రీజియన్‌లో ఖాళీల వివరాలు: 14

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు దారుల వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి మూడేళ్లు ఉంటుంది. ఈ అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 16, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000ల చొప్పున ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు. దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.