TSRJC 2024 Exam Date: టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!

|

Apr 16, 2024 | 11:42 AM

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (TSRJC) ఆధ్వర్యంలోని 35 గురుకుల కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏప్రిల్‌ 21న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్జేసీ కన్వీనర్‌ రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌..

TSRJC 2024 Exam Date: టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
TSRJC 2024
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (TSRJC) ఆధ్వర్యంలోని 35 గురుకుల కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏప్రిల్‌ 21న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్జేసీ కన్వీనర్‌ రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. TSRJC CET కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73,527 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించి హాల్‌ టికెట్లు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఈ నెల 25 నుంచి ఇంటర్‌ ‘ఎపెన్‌’ ఎగ్జామ్స్‌.. పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఏప్రిల్‌ 25 నుంచి మే 2వ తేదీ వరకు పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కరీంగనగర్‌ జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరిపిన పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల మాదిరిగానే సమన్వయంతో పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా జిల్లాలో పదో తరగతి 923 మంది, ఇంటర్‌లో 1444 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్షలకు ఐదు కేంద్రాలను, ఇంటర్‌ పరీక్షలకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు మే 3 నుంచి 10 వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.