TSPSC HWO Exam Date 2024: తెలంగాణ గురుకులాల్లో 581 హాస్టల్ వార్డెన్ పోస్టులు.. రాత పరీక్షల షెడ్యూల్ ఇదే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్ష కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో..
హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యా సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్ష కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. తాజాగా విడుదలైన షెడ్యల్ ప్రకారం.. పరీక్షలను జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షలు కూడా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మాట్రాన్, మహిళా సూపరింటెండెంట్.. వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 2023 జనవరి 6 నుంచి జనవరి 27, 2023 వ తేదీ వరకు అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు.
తెలంగాణ గురుకుల హాస్టల్ వార్డెన్ రాత పరీక్ష షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్ష విధానం ఇలా..
రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్ నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్-2 లో ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్ విభాగాల నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి.
ఖాళీల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య.. 581
- ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -1) పోస్టులు: 5
- ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -2) పోస్టులు: 106
- ఎస్సీ డెవలప్‌మెంట్ హాస్టల్ వెల్ఫేర్ విభాగంలో ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు పోస్టులు: 70
- ఎస్సీ డెవలప్‌మెంట్ హాస్టల్ వెల్ఫేర్ విభాగంలో ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్) పోస్టులు: 228
- బీసీ వెల్ఫేర్ విభాగంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పోస్టులు: 140
- డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ విభాగంలో వార్డెన్ (గ్రేడ్ -1) పోస్టులు: 5
- డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ విభాగంలో మ్యాట్రన్ (గ్రేడ్ -1) పోస్టులు: 3
- డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ విభాగంలో వార్డెన్ (గ్రేడ్-2) పోస్టులు: 3
- డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ విభాగంలో మ్యాట్రన్ (గ్రేడ్-2) పోస్టులు: 2
- చిల్డ్రన్ హోం ఇన్ ఉమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ విభాగంలో లేడి సూపరింటెండెంట్ పోస్టులు: 19