TSPSC Group-2 Exam date: తెలంగాణ గ్రూప్‌-2 పోస్టులకు భారీగా పోటీ.. సిలబస్‌, పరీక్ష తేదీల వివరాలు ఇవే..

|

Mar 01, 2023 | 2:05 PM

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షకు భారీగా పోటీ నెలకొంది. కేవలం 783 పోస్టులకు ఏకంగా 5,51,943 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌..

TSPSC Group-2 Exam date: తెలంగాణ గ్రూప్‌-2 పోస్టులకు భారీగా పోటీ.. సిలబస్‌, పరీక్ష తేదీల వివరాలు ఇవే..
Telangana
Follow us on

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షకు భారీగా పోటీ నెలకొంది. కేవలం 783 పోస్టులకు ఏకంగా 5,51,943 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(కోఆపరేటివ్‌ సొసైటీ), ఏసీటీవో, డిప్యూటీ తహసీల్దార్‌, సహాయ లేబర్‌ అధికారి, ఎంపీడీవో, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల్లో మొత్తం 783 ఖాళీల భర్తీకి గత డిసెంబరులో టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గానూ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జరిగింది. ఇక గ్రూప్‌ – పరీక్షలను సంబంధించిన తేదీలు కూడా టీఎస్పీయస్సీ తాజాగా విడుదల చేసింది. మొత్తం 4 పేపర్లకు ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో పేపర్ 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు కలిపి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కులుండవు. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల అవుతాయి.

  • పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌,
  • పేపర్‌-2 చరిత్ర, రాజకీయం, సమాజం
  • పేపర్‌-3 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
  • పేపర్‌-4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.