తెలంగాణ మహిళాశిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టులకు జనవరి 8న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ని తాజాగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు మాస్టర్‌ప్రశ్నపత్రం, అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ షీట్ ప్రతులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. మొత్తం 181 పోస్టులకుగానూ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 33,405 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరంతా కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని చెక్ చేసుకుని జనవరి 21 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను లేవనెత్తవల్సిందిగా టీఎస్పీయస్సీ సూచించింది.
అభ్యంతరాలను కేవలం వెబ్‌సైట్‌లో మాత్రమే లేవనెత్తాలని ఈ-మెయిల్స్, రాతపూర్వకంగా ఇచ్చే అభ్యర్ధనలను పరిశీలించబోమని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.