TSPSC: రేపే తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష.. షూస్‌ వేసుకుంటే పరీక్షకు అనుమతించరు.

|

Jun 10, 2023 | 8:10 AM

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం తర్వాత పరీక్షలు జరుగుతుండడంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ...

TSPSC: రేపే తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష.. షూస్‌ వేసుకుంటే పరీక్షకు అనుమతించరు.
Tspsc Group 1
Follow us on

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం తర్వాత పరీక్షలు జరుగుతుండడంతో సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలకు పూనుకుంది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. పటిష్ట ప్రణాళికలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశాలు జరిపింది. ఈసారి ఈ పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లను, చీఫ్‌ కో-ఆర్డినేటర్లుగా సబ్‌ కలెక్టర్లను నియమించింది.

ఇక పరీక్షా కేంద్రాల్లో చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉంటే నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. గత అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఫలితాలనూ సైతం ప్రకటించారు. అయితే పేపర్‌ లీక్‌ నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు. రద్దయిన పరీక్షను ఆదివారం (ఈ నెల 11న) నిర్వహించనున్నారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు.

పేపర్‌ లీకేజీ నేపథ్యంలో ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..