TSNPDCL Recruitment: బీటెక్‌ చేసిన వారికి తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

| Edited By: Ravi Kiran

Jun 20, 2022 | 11:27 AM

TSNPDCL Recruitment: వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలగాణ ప్రభుత్వం తాజాగా విద్యుద్‌ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. టీఎస్‌ఎన్పీడీసీల్‌ (తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ)లో..

TSNPDCL Recruitment: బీటెక్‌ చేసిన వారికి తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us on

TSNPDCL Recruitment: వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలగాణ ప్రభుత్వం తాజాగా విద్యుద్‌ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. టీఎస్‌ఎన్పీడీసీల్‌ (తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ)లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మొత్తం 82 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్టికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్టికల్‌ అండ్‌ ఎలక్టానిక్స్​​ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చే ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అప్లికేషన్‌ ఫీజుగా రూ. 200 చెల్లించాలి.

* ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుల కోసం 27-06-2022 నుంచి 11-07-2022 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 27-06-2022 నుంచి 11-07-2022 వరకు చేసుకోవాలి.

* అభ్యర్థులలు హాల్‌ టికెట్లను 06-08-2022 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను 14-08-2022వ తేదీన నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..