TSLPRB Results 2022: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022ల ఫలితాలు ఈ వారంలోనే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితాల విడుదలకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ముహూర్తం ఖరారు చేసింది. అన్నీ సక్రమంగా పూర్తైతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే..

TSLPRB Results 2022: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022ల ఫలితాలు ఈ వారంలోనే!
TSLPRB Results 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2022 | 9:00 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితాల విడుదలకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ముహూర్తం ఖరారు చేసింది. అన్నీ సక్రమంగా పూర్తైతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న 8.5 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణకు తెర పడనుంది. కాగా ఈ ఏడాది మొత్తం 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,47,217 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అనంతరం 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఆగస్టు 28వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు పరీక్షకు హాజరైన 6,03,955 మంది పరీక్ష రాశారు. నిజానికి, నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షల ఫలితాలు సెప్టెంబరులోనే వెల్లడించవల్సి ఉంది. ఐతే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో ఫలితాల ప్రకటన కొంత ఆలస్యమైంది. ఈక్రమంలో కటాఫ్‌ మార్కులను బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు 40కి తగ్గిస్తూ పోలీస్ నియామక బోర్డు అక్టోబర్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఓసీ అభ్యర్థులకు మాత్రం యథాతథంగా కటాఫ్‌ మార్కులను 60 మార్కులుగా నిర్ణయించారు. ఈ వారంలో విడుదల చేయనున్న ఫలితాను తగ్గించిన కటాఫ్‌ మార్కులకు అనుగుణంగా వెల్లడించనున్నారు.

ఎస్సై, కానిస్ట్రేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత ఫిజికల్‌ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్‌ పరీక్షలను నవంబరులో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే స్కోర్ కార్డుల్లో వీటి తేదీల వివరాలను కూడా పొందుపరచనున్నట్లు సమాచారం. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్లకుగానూ తొలుత పరుగు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిలో నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.