TS SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగాయి. నిన్న ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల కాగా, టెన్త్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదోతరగతి పరీక్షలు జరగడంతో.. వీటి ఫలితాల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఫలితాల కోసం వెబ్‌సైట్ Tv9 Teluguతో పాటు www.bse.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి