TS SSC Exams 2022: పదో తరగతి విద్యార్ధులకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం..నేటి నుంచి పరీక్షలు ప్రారంభం!

|

May 23, 2022 | 7:02 AM

జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ ఆర్టీసీ బస్సులోనైనా టెన్త్‌ విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC)..

TS SSC Exams 2022: పదో తరగతి విద్యార్ధులకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం..నేటి నుంచి పరీక్షలు ప్రారంభం!
Free Bus Ride For 10th Stud
Follow us on

TSRTC Provides Free Bus Ride For Class 10 Students: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల30 నిముషాలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 5 నిముషాలు గ్రేస్‌ టైమ్‌ ఇచ్చారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇచ్చేలా ఈ గ్రేస్ పీరియడ్‌ (grace period)ను ఇచ్చారన్నమాట. అంటే 9 గంటల 35 నిముషాలలోపు విద్యార్ధులు ఆయా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. 2,861 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 5,09,275ల మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వెల్లాల్సి ఉంటుంది. జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ ఆర్టీసీ బస్సులోనైనా టెన్త్‌ విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఐతే ప్రయాణ సమయంలో విద్యార్ధులు తప్పనిసరిగా హాల్‌ టికెట్లు చూపించవల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం కూడా పరీక్షా కేంద్రం నుంచి గమ్యస్థానానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు.

కాగా ఈ సారి పరీక్షల్లో పారదర్శకత కోసం అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్టేట్ డైరెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్, పొరపాట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘Z’ ఆకారంలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గదులైతే 12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేలా బెంచీలు వేస్తున్నారు. మండుటెండల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖాధికారులు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.