హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. సోమవారం ఉదయం తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా టెన్త్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 91.31శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2,676 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.