తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సీవోఈ (సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్) కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలతోపాటు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లలో అడ్మిషన్లు, మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్, ఒకేషనల్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తరగతిని బట్టి వాటికి ముందున్న 4, 5, 6, 7, 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి.
5వ తరగతిలో ప్రవేశాలకు.. ముందుగా దరఖాస్తు చేసుకున్న మైనారిటీలకు సీట్లు కేటాయిస్తారు. ఇతరులకు లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇక 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను మొదట దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఏవైనా సందేహాలుంటే 040 23437909కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే ఆయా జిల్లాల్లోని మైనారిటీ సంక్షేమ అధికారులను, గురుకులాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తెలుసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.