TS Inter Supply Exams 2024: ఇంటర్ ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు అలర్ట్.. రేపటితో ముగుస్తోన్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు!

|

May 01, 2024 | 3:07 PM

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకునే విద్యార్ధులు సకాలంలో పరీక్ష రుసుం చెల్లించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులు తాము చదువుతోన్న జూనియర్‌ కాలేజీల్లోనే రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపులు మే 2వ తేదీతో ముగుస్తాయని, ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్ధులు రేపటిలోగా..

TS Inter Supply Exams 2024: ఇంటర్ ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు అలర్ట్.. రేపటితో ముగుస్తోన్న ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు!
TS Inter Supply Exams
Follow us on

హైదరాబాద్‌, మే 1: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అలర్ట్. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకునే విద్యార్ధులు సకాలంలో పరీక్ష రుసుం చెల్లించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులు తాము చదువుతోన్న జూనియర్‌ కాలేజీల్లోనే రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపులు మే 2వ తేదీతో ముగుస్తాయని, ఇప్పటి వరకు ఫీజులు చెల్లించని విద్యార్ధులు రేపటిలోగా చెల్లించాలని సూచించారు. ఇక కాలేజీల ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు గడువు మే 3వ తేదీతో ముగుస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు.

ఫీజు చెల్లింపుల ప్రక్రియ అనంతరం ఇదే నెల నుంచే ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 24 వ తేదీ నుంచి జూన్‌ 1వ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఆయా తేదీల్లో రోజుకు రెండు షెఫ్టుల ప్రకారం పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండియర్‌ పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫస్టియర్‌ ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌ జూన్‌ 10న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. జూన్‌ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరుగుతుంది. జూన్ 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జరుగుతుంది.

మరోవైపు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఫీజు చెల్లింపులు ఈ రోజు నుంచి మే 16వ తేదీ వరకు కొనసాగుతాయి. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.