Mental health support to students to overcome exam fear or anxiety: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంగళవారం (జూన్ 28) ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్లు ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in లేదా https://examresults.ts.nic.in లేదా https://resutls.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఫలితాలను తనిఖీ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే helpdesk-ie@telangana.gov.inకు మెయిల్ లేదా 040-24601010 / 040-24655027 నంబర్లకు ఫోన్ చేసి సందేహ నివృతి చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెల్పింది. అలాగే విద్యార్ధుల్లో ఒత్తిడి, పరీక్షల భయాన్ని దూరం చేసేందుకు స్టూడెంట్ కౌన్సెలర్లను కూడా ఏర్పాటు చేసింది. విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు 2500 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు బోర్డు పేర్కొంది. అంతేకాకుండా విద్యార్ధుల్లో తలెత్తే ఒత్తిడి, స్ట్రెయిన్, టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళన ఇతర సమస్యల నివారణకు క్లినికల్ సైకాలజిస్టులకు సంబంధించిన ఫోన్ నంబర్లతోపాటు, టోల్ ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేసింది. విద్యార్ధులు కింది లిస్టులో ఇచ్చిన సైకాలజిస్టులకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
క్లినికల్ సైకాలజిస్టుల పేర్లు- ఫోన్ నంబర్లు
ఇంటర్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.