Telangana Inter Practical Exams 2023: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌పై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన

|

Jan 30, 2023 | 5:53 PM

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగే ప్రాక్టిలకల్స్‌ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో..

Telangana Inter Practical Exams 2023: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌పై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన
Telangana Inter Board
Follow us on

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగే ప్రాక్టిలకల్స్‌ పరీక్షలు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ ఆధారంగా జరుగుతాయని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ప్రాక్టికల్స్ జరనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు జరుగుతాయి. వార్షిక పరీక్షలు మాత్రం ఫస్టియర్‌, సెకండియర్‌లకు వంద శాతం సిలబస్‌తో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20,22,25,27,29 మే 2 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు, ఏప్రిల్ 21, 23, 26, 28, 30, మే 5 తేదీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు జరగనున్నాయి. మార్చి 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.