TS Inter and 10th Class Results 2024 : తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన! ముఖ్యమైన తేదీలివే..

|

Apr 17, 2024 | 10:42 AM

తెలంగాణ ఇంటర్, పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 25 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 10 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్, సెకండ్‌ ఇయర్‌కు..

TS Inter and 10th Class Results 2024 : తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన! ముఖ్యమైన తేదీలివే..
TS Inter and 10th Class Results
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్ 17: తెలంగాణ ఇంటర్, పదో తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్మీడియల్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 25 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 10 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్, సెకండ్‌ ఇయర్‌కు కలిపి ఒకేసారి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 4 విడతల్లో జరిగిన ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ పూర్తికావడంతో మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్‌ 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మార్కుల వెల్లడికి ఈసీ అనుమతి కోరుతూ ఇంటర్‌ బోర్డు లేఖను రాసింది. ఈసీ నుంచి అనుమతి లభిస్తే ఏప్రిల్ 22 నుంచి 25 మధ్య ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

కాగా ఈ ఏడాది మొత్తం 9 లక్షల మందిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. గతేడాది నాటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 9వ తేదీని ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విడుదల చేశారు. గతేడాది సుమారు 9 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 2023 ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 61.68 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే గత ఏడాది మాదిరిగా కాకుండా ఈసారి తొందరగానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈసీ అనుమతి రాగానే ఫలితాల ప్రకటన తేదీపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటన అనంతరం tsbie.cgg.gov.in, results.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు.

మరోవైపు తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపుగా చివరికి వచ్చింది. ఏప్రిల్ 3న ప్రారంభమైన స్పాట్ వాల్యూయేషన్ 13వ తేదీ వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ చేపట్టారు. మార్కులు కంప్యూటరీకరణ, పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ చివరి వారంలో లేదంటే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.