TSPSC 2022: ఆ శాఖల్లోని 2 వేలకుపైగా ఉన్న ఇంజనీర్‌ పోస్టుల భర్తీ ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపిక!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖ, గ్రూప్‌ 1 నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే! ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక నీటిపారుదల, పంచాయతీరాజ్‌..

TSPSC  2022: ఆ శాఖల్లోని 2 వేలకుపైగా ఉన్న ఇంజనీర్‌ పోస్టుల భర్తీ ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపిక!
Tspsc
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2022 | 11:12 AM

TSPSC likely to release another notification 2022 soon: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్‌ శాఖ, అగ్నిమాపక శాఖ, గ్రూప్‌ 1 నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే! ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక నీటిపారుదల, పంచాయతీరాజ్‌ (TS Panchayati Raj vacancies), రహదారులు-భవనాలు, ప్రజారోగ్య శాఖల పరిధిలో ఇంజినీర్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ల పోస్టులు, ఎంపిక ప్రక్రియపై మే 21న నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో జలసౌధలో సమావేశం జరిగింది. శాఖల కార్యదర్శులు, ఈఎన్‌సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (Executive Engineers, Assistant Executive Engineer jobs) ఉద్యోగాలకు కలిపి ఈ శాఖల పరిధిలో దాదాపు 2 వేల వరకు ఖాళీలున్నాయి. ఇంజినీరింగ్‌ శాఖలు జేఎన్‌టీయూ లాంటి సంస్థల సహకారంతో ఎంపిక నిర్వహించాలా? లేక టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించి విధి, విధానాలను రూపొందించినట్లు సమాచారం. అనంతరం ఏ విధంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారనే విషయం ఖరారు చేశాక.. నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.