TS Govt Jobs: తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో 472 పోస్టుల భర్తీకి సర్కార్‌ ఆమోదం.. నేడో, రేపో నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో కొత్తగా 472 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తూ జ‌న‌వ‌రి 5 (బుధవారం) ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులన్నీ ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పరిధిలో భర్తీ..

TS Govt Jobs: తెలంగాణ రోడ్లు భవనాల శాఖలో 472 పోస్టుల భర్తీకి సర్కార్‌ ఆమోదం.. నేడో, రేపో నోటిఫికేషన్‌ విడుదల..
Telangana Jobs

Updated on: Jan 06, 2023 | 8:51 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖలో కొత్తగా 472 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తూ జ‌న‌వ‌రి 5 (బుధవారం) ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులన్నీ ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పరిధిలో భర్తీ చేయనున్నారు. దీనితోపాటు బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 2,591 గురుకుల పోస్టుల భర్తీకి అనుమతి ప్రక్రియ ఆర్థికశాఖలో దాదాపు పూర్తయింది. మంత్రి హరీశ్‌రావు ఆమోదిస్తే పోస్టులకు జ‌న‌వ‌రి 7న‌ ప్రకటన వెలువరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్‌ 4కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక జనవరి 18 నుంచి గ్రూప్‌-2 సర్వీసులకు, జనవరి 24 నుంచి గ్రూప్‌-3 సర్వీసులకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరన ప్రారంభమవుతుంది. ముందస్తు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ప్రాధాన్యత క్రమం బట్టి ఆయా పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారని ఇప్పటికే కమిషన్‌ స్పష్టం చేసింది కూడా.

అటు సంక్షేమ శాఖల్లోని 581 వార్డెన్‌ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు కాలేజీలు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌లో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఇన్ని పోస్టులకు ఒక్క జనవరి నెలలోనే దరఖాస్తులు ప్రారంభమవడంతో సర్వర్‌ బిజీ వచ్చే అవకాశం ఉంది. అందుకే చివరి తేదీ వరకు వేచి చూడకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవల్సిందిగా టీఎస్పీయస్సీ సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.