TS ECET Results 2021: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..!

|

Aug 18, 2021 | 12:17 PM

TS ECET Results 2021: పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత..

TS ECET Results 2021: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..!
Ts Ecet 2021
Follow us on

TS ECET Results 2021: పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు రాసిన తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఈ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఫలితాల్లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3న జరిగిన ఈసెట్‌కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, అలాగే 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. ఇక సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబరు 13న తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధృవపత్రాల పరిశీలన తర్వాత సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు.

ఫలితాలను చెక్‌ చేసుకోండిలా..

1. ముందుగా TS ECET 2021 అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన TS ECET 2021 ఫలితం లింక్‌పై క్లిక్‌ చేయాలి.
3. తుదపరిగా వచ్చిన తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
4. ఆ తర్వాత ఆ లింక్‌లో ఇచ్చిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

అందులో విద్యార్థి పేరు, రోల్‌ నెంబర్‌, పరీక్ష పేరు, ప్రతి విభాగంలో పొందిన మార్కుల జాబితా, మొత్తం మార్కుల వివరాలు ఉంటాయి.

ఇవీ కూడా చదవండి: Indian Air Force Recruitment: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

UBI Recruitment 2021: యూనియన్‌ బ్యాంకులో 347 ఉద్యోగాలకు నోటిపికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..!