TS EAMCET 2022 counselling registration, slot booking begins: తెలంగాణ ఎంసెట్ ఆప్షన్ల నమోదు సమయం ఎప్పుడన్నది ఇంకా తెలియరాలేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (ఆగస్టు 23) నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావల్సి ఉంది. ఐతే ఐచ్ఛికాల నమోదు ప్రారంభ సమయం ఎప్పుడన్నది అధికారులు ఇంకా ప్రకటించకపోవడంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. గత ఏడాది మాదిరిగానే ఈ యేడాది కూడా చివరి క్షణం వరకు సస్పెన్స్ నెలకొంది. ఆగస్టు 22న జేఎన్‌టీయూహెచ్ రాష్ట్రంలోని మొత్తం 145 ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీ వివరాలను పూర్తిచేసింది. ఆ వివరాలు ఉన్నత విద్యామండలికి చేరిన తర్వాత వాటిని కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకు కాలేజీలలోని సీట్ల వివరాలను పంపలేదు. ఈ ప్రక్రియ మొత్తం ఈ రోజు (మంగళవారం) పూర్తి చేసి రాత్రికి ఆప్షన్ల నమోదును అందుబాటులోకి తీసుకొస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. కనీసం ఒక రోజు ముందుగానైనా కాలేజీలు, సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచక పోవడంతో సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.