TS EAMCET: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఎంసెట్‌ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎప్పుడంటే..

|

May 23, 2023 | 6:27 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రిజల్ట్స్‌ను మే 25న విడుదల చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేయనున్నారు....

TS EAMCET: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఎంసెట్‌ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎప్పుడంటే..
TS EAMCET Results
Follow us on

తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రిజల్ట్స్‌ను మే 25న విడుదల చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేయనున్నారు. పాస్‌వర్డ్‌ సీడీని 11.15 గంటలకు విడుదల చేస్తారు. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలను ముందుగా టీవీ9 తెలుగు వెబ్ సైట్ లో త్వరగా తెలుసుకోవచ్చు.  ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి హాజరుకానున్నారు. ఈ విషయమై ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.డీన్‌ కుమార్‌ అధికారిక ప్రకటను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేశారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇక ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది హాజరైన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..